ఆంధ్రప్రదేశ్ హత్యలు, కిడ్నాప్‌లకు నిలయంగా మారింది: చంద్రబాబు

కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మీడీయాతో ముచ్చటించారు. రాష్ట్రం హత్యలు, కిడ్నప్‌లకు నిలయంగా మారుతోందన్నారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు విశాఖ ఎంపీ కుమారుడు, భార్యని కిడ్నప్ చేశారంటే అసలు రాష్ట్రం ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కాళేశ్వరం కట్టారు అక్కడ నీటిసమస్య, కరువు లేకుండా చేశారు, అదే ఇక్కడ పోలవరం పనులు పూర్తయ్యి నదుల అనుసంధానం చేసి ఉంటే కరువు అనేది ఉండేది కాదని తెలిపారు. ప్రజల్లో చైతన్యం మొదలయ్యింది వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొడతారని జోష్యం చెప్పారు.
రాష్ట్రంలో భూ దందాలు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ప్రతిపక్షాన్ని, మీడియాని కూడా నియంత్రించాలని ఈప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు మొదలయ్యింది గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన తప్పును ఇప్పుడు తెలుసుకున్నారన్నారు. రాష్ట్రానికి గుర్తింపు లేకుండా చేశారు, బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను లక్షల కోట్ల రూపాయల అప్పులోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్రం సంవత్సరానికి 40 వేలకోట్ల ఆదాయం కోల్పోతోందని తెలిపారు. అమరావతి పూర్తయిఉంటే లక్ష కోట్లు ఆదాయం వచ్చేదని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com