కేంద్రం మెడలు వంచుతానని.. జగన్ మెడలు దించాడు : చంద్రబాబు

కేంద్రం మెడలు వంచుతానని.. జగన్ మెడలు దించాడు : చంద్రబాబు
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కేంద్రం మెడలు వంచుతానని.. జగన్ మెడలు దించాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చెప్పినట్లుగా మంత్రులు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అప్పులు, అవినీతి పెరిగిపోయాని మండిపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసం పాలన కొనసాగుతోందని.. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags

Next Story