వైసీపీ సర్కారును ఘాటుగా విమర్శించిన చంద్రబాబు
వైసీపీ సర్కారుపై ఘాటుగా విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారంలో ఉన్నవాళ్లు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రి పగలూ ఆలోచిస్తారని, ఆ దిశగా.. అధికారయంత్రాంగాన్ని కూడా ఉత్తేజపరుస్తారన్నారు. కానీ వైసీపీ పాలకుల తీరు వేరని, ప్రతిపక్షనేతలపై ఎలా కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనలతో రాత్రిళ్లు నిద్రకూడా పోతున్నట్లు లేదంటూ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. దీనికి అర్థరాత్రి అరెస్ట్‌లు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులే నిదర్శనమన్నారు.
మాజీ ఎంపీ సబ్బంహరి స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు సోమవారం వరకు స్టేటస్ కో విధించిందని కానీ...ఈ లోపే 3 రోజుల్లో భవనాలు తొలగించాలని ప్రభుత్వం మరో నోటీసు పంపిందన్నారు. ఈ నోటీసును కూడా రాత్రి వేళ ఇంటికి అంటించి పోయారన్నారు. కక్ష రాజకీయాల కోసం పాలనా యంత్రాంగాన్ని, వ్యవస్థలను భ్రష్టుపట్టించడం రాష్ట్రానికి చేటు తెస్తుందన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com