జగన్‌ చేతిలో రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది : చంద్రబాబు

జగన్‌ చేతిలో రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది : చంద్రబాబు

సీఎం జగన్‌ చేతిలో ఏపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ ఫైర్‌ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యంగా మార్చారని, ఎవరిని స్వేచ్చగా బతనిచ్చేలా లేరంటూ మండిపడ్డారు. టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు, పరిశీలకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా... వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నడూ లేనంతగా కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం ఎప్పుడూ చూడలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు ఎన్నడు లేనంతగా పెరిగాయన్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రచరిత్రలో ఏనాడు లేదన్నారు. అమరావతి టీడీపీ నేతలతో బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, కక్షసాధింపు చర్యలు మునుపెన్నడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేరగాళ్ల రాష్ట్రంగా మార్చారని, ఎవరినీ స్వేచ్చగా బతకనిచ్చేలా లేరన్నారు.

పోలీసుల వేధింపులు తట్టుకోలేకనే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. దొంగతనం పేరుతో వేధించడం వల్లే భార్యాపిల్లలతో సహా రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో హత్యలు, శిరోముండనాలు పెరిగాయని, ప్రజల ప్రాణాలు తీసే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ పెట్టారు. నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యల కేసును సీబీఐకి ఇవ్వాలన్నారు. నంద్యాల ఘటన దర్యాప్తునకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, సామూహిక ఆత్మహత్యలకు కారణమైన అధికారులను సర్వీసులనుంచి డిస్మిస్ చేయాలన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మశాంతికోసం మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story