సీఎం జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు.. దరిద్రపు పాలనతో జనం విసిగిపోయారు : చంద్రబాబు

సీఎం జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు.. దరిద్రపు పాలనతో జనం విసిగిపోయారు : చంద్రబాబు
సీఎం జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని, దరిద్రపు పాలనతో జనం విసిగిపోయారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. క్రిష్ణాపురం ఠాణా వద్ద చంద్రబాబు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు.

సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎంపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి తరపున తిరుపతిలో ప్రచారం చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిందని.. రౌడీయిజం పెరిగిందని మండిపడ్డారు. రెండేళ్లలో రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు చంద్రబాబు. ఒక్క అవకాశమంటూ ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టారని, ఇప్పుడు రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. హోదా తేస్తానన్న జగన్‌.. రెండేళ్లైనా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు చంద్రబాబు.

వైసీపీ నేతలు బందిపోట్ల మించిపోయారంటూ మండిపడ్డారు చంద్రబాబు. దరిద్రపు పాలనతో జనం విసిగిపోయారన్నారు. పోలీసులను పెట్టుకుని రాజకీయం చేయడం కాదని, నామినేషన్‌ వేసిన వాళ్లని బెదిరిస్తారా? అంటూ మండిపడ్డారు. ఈ రాష్ట్రం జగన్‌ తాత జాగీరా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. పులివెందుల సంస్కృతి రాష్ట్రంలో తేవాలనుకుంటున్నారా?. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దంటూ ఫైర్‌ అయ్యారు. ఇది పులివెందుల కాదు.. ఆంధ్రప్రదేశ్‌ అంటూ గుర్తు చేశారు చంద్రబాబు.

తిరుపతిని ఏడు నుంచి 5 కొండలు చేస్తామని అప్పట్లో వైఎస్‌ అన్నారని గుర్తు చేశారు చంద్రబాబు. పింక్‌ డైమండ్‌ తన ఇంట్లో ఉందని ఆరోపణలు చేశారని, ఇప్పుడు అసలు పింక్‌ డైమండే లేదంటున్నారని విమర్శించారు. రాముడి తల తీసిన వాళ్లను పట్టుకోకుండా నిలదీసిన తమపై కేసులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మరో దేవాలయంపై దాడి జరిగితే అంతుచూస్తామని హెచ్చరించారు. ఓట్ల కోసం ఇంటింటికి తిరుమల లడ్డూని పంచారని, లడ్డూలు పంచుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story