ఆంధ్రప్రదేశ్

Chandrababu: ఇది దద్దమ్మ ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం- చంద్రబాబు

Chandrababu: పోరాడితేనే వైసీపీ విధ్వంసం ఆగుతుందని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu: ఇది దద్దమ్మ ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం- చంద్రబాబు
X

Chandrababu: పోరాడితేనే వైసీపీ విధ్వంసం ఆగుతుందని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉత్తరాంద్ర జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. వైసీపీ నేతలు, సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని దిక్కుమాలిన ప్రభుత్వం పాలిస్తుందన్న చంద్రబాబు.. మనుషులంటే దానికి లెక్కలేదన్నారు. ఎక్కడ చూసినా బాదుడే బాదుడు కొనసాగుతోందన్నారు. ఇప్పటికే అన్ని ఛార్జీలూ పెరిగాయన్నారు. త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారని పేర్కొన్నారు. గతంలో కరెంట్‌ ఛార్జీలు పెంచకుండా విద్యుత్‌ సరఫరా చేశామని.. కానీ నేడు ఖాళీ ఇళ్లకూ మినిమం ఛార్జీలు వడ్డిస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇక ఓటీఎస్‌ను ఎవ్వరూ కట్టొద్దన్న ఆయన.. టీడీపీ సర్కారు వచ్చాక ఉచిత రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. టెన్త్‌ ఫలితాలపై స్పందించిన చంద్రబాబు.. గతంలో ఎప్పుడైనా ఇంత తక్కువ రిజల్ట్‌ వచ్చిందా అని ప్రశ్నించారు. జగన్‌ గురువుల్ని ఎప్పుడు కించపరిచారో అప్పుడే విద్యావ్యవస్థ నాశనమైందని అన్నారు. టీచర్లను తీసుకెళ్లి మందుషాపుల దగ్గర క్యూలైన్లో నిలబెట్టారని చంద్రబాబు విమర్శించారు. గురువును అవమానించిన వాడు బాగుపడ్డాడా అని ప్రశ్నించారు. ఇక తాను ప్రారంభించిన ఐటీ ద్వారా ఎంతోమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.

ఇక టీడీపీ హయాంలో టీచర్లు, పోలీసుల ఉద్యోగాలిస్తే ఇప్పుడు మాత్రం.. ఐదు వేలకు వాలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కనీస వేతనం కూడా ఇవ్వకుండా తాను ఉద్యోగమిచ్చినట్లు జగన్‌ లక్షసార్లు చెప్తున్నారన్నారు. బాబాయ్‌ను ఎవరు చంపారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న ముగ్గురు చనిపోయారని తెలిపారు. ఇక కోడి కత్తి ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. తూర్పుగోదావరిలో ఎస్సీ వ్యక్తి సుబ్రమణ్యాన్ని చంపేసిన ఎమ్మెల్సీకి వైసీపీ పాలాభిషేకాలు చేస్తోందని చంద్రబాబు అన్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES