AP Government : విశాఖ శారదా పీఠానికి చంద్రబాబు సర్కారు షాక్

ఏపీలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. విశాఖ శారదా పీఠానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. తిరుమలలో ఆ పీఠం చేపట్టిన భవనాలకు అనుమతులు రద్దు చేసింది. గత ప్రభుత్వం హయాంలో తిరుమల గోగర్భం డ్యామ్ ప్రాంతంలో శారదా పీఠానికి భూమి లీజుకు ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించారంటూ అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోకి ఆదేశాలు జారీ చేశారు.
దాదాపు 20 ఏళ్ల కిందట 2005 ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం తిరుమలలో భక్తులకు వసతి, అన్నప్రసాదాలు కల్పించేందుకంటూ శారదా పీఠానికి గోగర్భం జలాశయ ప్రాంతంలో 5వేల చదరపు అడుగుల స్థలాన్ని 30ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. సెల్లార్, గ్రౌండ్, మొదటి రెండు, మూడు అంతస్తుల నిర్మాణానికి 2007లో శారదా పీఠం నిర్వాహకులు అనుమతులు తీసుకున్నారు. కానీ, పీఠం నిర్వాహకులు టీటీడీ ఇచ్చిన అనుమతులను పక్కనబెట్టి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారనే విమర్శలున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదనపు నిర్మాణాలకు అనుమతులు పొందింది. కానీ, దానిని కూడా నిబంధనలు అతిక్రమించి అదనంగా నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు నిర్ధారించినట్లు తెలిసింది. దీంతో అదనపు నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాన్ని తిరస్కరించింది కూటమి ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com