CM : జగన్ ఆస్తి గొడవలపై చంద్రబాబు హాట్ కామెంట్స్

CM : జగన్ ఆస్తి గొడవలపై చంద్రబాబు హాట్ కామెంట్స్
X

వైసీపీ నేత జగన్ తమను నిందిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లి, చెల్లిని రోడ్డుపైకి జగన్ లాగాడనీ.. ఇలాంటి వ్యక్తులతో తాను రాజకీయాలు చేస్తానని అనుకోలేదన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటే జగన్‌ను విమర్శించకూడదని షరతు పెట్టారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వారితో రాజకీయం చేయాలంటే సిగ్గనిపిస్తోందన్నారు. గత జగన్‌ ప్రభుత్వం దాచిపెట్టిన చీకటి జీవోలపై విచారణ జరిపిస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. చీకటి జీవోల్లోని అక్రమాలు నిగ్గుతేల్చి గత తప్పిదాలు సరిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్నామని చెప్పుకొనేందుకు ఆ పార్టీ నేతలు సిగ్గుపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Tags

Next Story