Chandrababu: వరద బాధితులకు భరోసాగా చంద్రబాబు.. పర్యటనకు సిద్ధం..

Chandrababu: వరద బాధితులకు భరోసాగా చంద్రబాబు.. పర్యటనకు సిద్ధం..
X
Chandrababu: ఏపీలోని ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

Chandrababu: కష్టం ఎక్కడ ఉంటే ఆయన దృష్టి అక్కడ పడుతుంది. కన్నీళ్లు ఎక్కడ ఉంటే ఆయన పాదాలు అటు వైపు కదులుతాయి. ఆ చల్లని మనసున్న నేతే.. చంద్రబాబు నాయుడు. గోదావరి మిగిల్చిన బాధలను పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదు. బటన్ నొక్కడంలో.. బాదుడే బాదుడులో బిజీగా ఉన్నట్టుంది. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ముంపు ప్రాంతాల గోసలను చూసి చలించిపోయారు. బాధితులను పరామర్శించేందుకు వరదల్లో మునిగిన గ్రామాల పర్యటనకు సిద్ధమయ్యారు.

ఏపీలోని ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మొదటి రోజు కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో పర్యటిస్తారు. అలాగే రెండో రోజు పాలకొల్లు, నరసాపురంలో ముంపు ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రజలను నేరుగా కలుసుకుని వారి బాధలు తెలుసుకోనున్నారు.

గోదావరి భీకర వరదలకు విలవిలలాడిన గ్రామాలను చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఆయోధ్యలంక, నాగుల్లంక, మనెపల్లి, అప్పనపల్లి, రాజోల్, దొడ్డిపట్ల, అబ్బురాజుపాలెం, గంగాధరపాలెం, లక్ష్మీపురం, పొన్నపల్లి గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. వరద బాధలను పట్టించుకోని ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయంపై చంద్రబాబు సోషల్‌ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. అల్లూరి జిల్లా చింతూరు మండలం గోదావరి వరద సాయంపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

నిర్వాసితులకు అందిన కొద్దిపాటి కూరగాయల ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారాయన. నాలుగంటే నాలుగే.. ఇదీ జగన్‌ సర్కారు వరద సాయం అంటూ ఎద్దేవా చేశారు. బాధిత మహిళకు ఇచ్చిన నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళదుంపల ఫోటోను ట్విట్టర్‌లో జత చేశారు. లెక్క చూసుకో జగన్‌ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకృతి ప్రకోపం.. వరద బాధితులకు ఏం మిగల్చకుండా చేసింది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మిగిలిన ఆ కాస్త నమ్మకం కూడా ఈ వరదలతో కొట్టుకపోయిందని ముంపు ప్రాంత ప్రజలు అంటున్నారు. ఇక చంద్రబాబు వస్తుండడంతో జనాలు తమ బాధలను చెప్పుకోవడానికి ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story