70 ఏళ్ల వయసులోనూ చమట చిందిస్తున్న చంద్రబాబు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే... శ్రమకి మారుపేరు. రోజులో 18 గంటలకు పైగా కష్టపడడం ఆయన ప్రత్యేకత. ముఖ్యమంత్రి విధులు నిర్వహించినా.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా... కష్టపడే తత్వంలో ఏ మాత్రం తేడా ఉండదు. అయితే ఆయన ఎంతగా శ్రమించినా... ఆయన వేషధారణ మాత్రం ఎప్పుడూ ఫ్రెష్‌గానే ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసినా చొక్కాకున్న గంజి మడతలు కూడా నలగవు. అందుకే చంద్రబాబును ఊహించుకోగానే మనకు ఓ పర్ఫెక్ట్ డ్రెస్సింగ్ మదిలో మెదులుతుంది.
అయితే తిరుపతి ఎన్నికల సందర్భంగా తీసిన ఓ ఫోటో మాత్రం... అందరినీ అశ్చర్యపరుస్తోంది. ఎన్నికల ప్రచారం ముగించుకున్న చంద్రబాబు పూర్తిగా అలసిపోయారు. చమటతో ఆయన చొక్కా పూర్తిగా తడిచిపోయింది. గెలుపోటములతో సంబంధం లేకుండా... ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి పట్టణంలో తిరుగుతూ... సర్కారు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన ఎండవేడిమిని సైతం లెక్కచేయడం లేదు.
70 ఏళ్ల వయసులోనూ యువతతో పోటీ పడుతూ చంద్రబాబు కష్టపడుతున్న తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ఇబ్బందులను లెక్కచేయకుండా.. తిరుపతిలో ఆయన శ్రమిస్తున్న తీరును... యువత ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com