Chandrababu : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు, ఏపీ గవర్నర్‌కు లేఖ రాశారు చంద్రబాబు.

Chandrababu : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు, ఏపీ గవర్నర్‌కు లేఖ రాశారు చంద్రబాబు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని... జోక్యం చేసుకోవాలంటూ లెటర్‌ పంపారు. నారాయణను హైదరాబాద్‌ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశం ఉందన్నారు. పేపర్‌ లీకేజీ కేసులో అదనపు సెక్షన్‌లు జోడించి... అక్రమ అరెస్ట్‌కు పాల్పడ్డారని లెటర్‌లో పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్‌ సమయంలో జరిగిన ఉదాంతాన్ని ప్రస్తావించారు. వైసీపీకి అనుకూలంగా చిత్తూరు ఎస్పీ వ్యవహరిస్తున్నారని అమిత్‌ షాకు, గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story