పార్లమెంట్‌ సమావేశాలు.. ఎంపీలకు దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు

పార్లమెంట్‌ సమావేశాలు.. ఎంపీలకు దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు

పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.6 అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. రెండు జిల్లాలలో రెండు ఆలయాల రథాలకు నిప్పు, టీటీడీ భూములు అమ్మడానికి ప్రయత్నాలు, మాన్సాస్ ట్రస్ట్‌కు తూట్లు పొడవడం, ధార్మిక సంస్థలను దెబ్బతీయడం వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. అలాగే దళితులు-గిరిజనులపై అఘాయిత్యాలు, బీసీలు-మైనారిటీలపై అక్రమ కేసులు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, దళితులపై వైసీపీ దమనకాండ గురించి రాజ్యాంగ పెద్దలకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంటులో ప్రస్తావించడంతోపాటు.. రాజధానిపై వైసీపీ మూడు ముక్కలాటతో జరిగే నష్టంపై పార్లమెంటులో నిలదీయాలని ఎంపీలకు సూచించారు చంద్రబాబు. పీపీఏల మాదిరిగానే, రైతులతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాన్ని గౌరవించేలా, కేంద్రమే జోక్యం చేసుకుని పరిష్కరించాలని ఎంపీలు అభిప్రాయప్డడారు.

నరేగా చట్ట స్ఫూర్తికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడవడాన్ని కూడా ఉభయ సభల్లో ఎండగట్టాలని నిర్ణయించారు.. ల్యాండ్ లెవలింగ్ పేరుతో వేల కోట్ల నరేగా నిధుల దుర్వినియోగాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీలో ప్రాథమిక హక్కులను కాలరాయడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, మీడియాపై ఆంక్షలు, జర్నలిస్ట్ లపై దాడులపై పార్లమెంటులో నిలదీయనున్నారు ఎంపీలు.

Tags

Read MoreRead Less
Next Story