ఆంధ్రప్రదేశ్

టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం..

లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు జగన్‌రెడ్డి భ్రమింపచేశారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.

టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం..
X

లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు జగన్‌రెడ్డి భ్రమింపచేశారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. దిశ చట్టం ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలని ప్రశ్నంచారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు....ఈ నెల 9న నర్సరావుపేటలో నిరసన కార్యక్రమం చేపడ్తామన్నారు చంద్రబాబు. ఇవాళ టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు.

వినాయక చవితి పూజలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారని ప్రశ్నించారు చంద్రబాబు. వైఎస్‌ వర్ధంతికి వర్తించని కోవిడ్‌ నిబంధనలు....వినాయక చవితికి ఎలా వర్తిస్తాయన్నారు. అటు తెలంగాణలో వినాయక పూజలకు అనుమతించినప్పుడు... ఏపీలో ఎందుకు అనుమతి నిరాకరించారన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 175 నియోజకవర్గాల్లో.... చవితి పూజలు నిర్వహించాలని టీడీపీ తీర్మానం చేసినట్లు తెలిపారు.

జగన్‌రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని... టీడీపీ నిర్ణయించిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని, కమీషన్ల కోసం విద్యుత్‌ను బయటినుంచి కొనుగోలు చేస్తున్నారని, ఈ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. దశలవారీ మద్యపాననిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి....ప్రజల్ని మోసం చేశారంటూ ఫైర్‌ అయ్యారు. ధర పెంచడంతోపాటు నాసిరకం మద్యంతో..లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు జగన్‌రెడ్డి భ్రమింపచేశారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. దిశ చట్టం ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలని ప్రశ్నంచారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు....ఈ నెల 9న నర్సరావుపేటలో నిరసన కార్యక్రమం చేపడ్తామన్నారు చంద్రబాబు. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

మద్యంలో ఇప్పటికే 25వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. మద్యంపై మహిళలతో కలసి ఉద్యమించాలని.... టీడీపీ నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయన్న చంద్రబాబు.... రెండేళ్ల పాలనలో ఎక్కడా ఒక్క రోడ్డు వేయలేదన్నారు. రోడ్డుసెస్‌ రూ. 1200 కోట్లు ఏమీచేశారని ప్రశ్నించారు చంద్రబాబు

Next Story

RELATED STORIES