Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాకృష్ణతో చంద్రబాబు భేటీ..

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాకృష్ణతో చంద్రబాబు భేటీ..
X
Vangaveeti Radha Krishna: టీడీపీ అధినేత చంద్రబాబు.. వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు.

Vangaveeti Radha Krishna: టీడీపీ అధినేత చంద్రబాబు.. వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని రాధా నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల రాధా హత్యకు రెక్కీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో.. ఆయనతో చంద్రబాబు భేటీ కావాడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెక్కీ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు.

రెక్కీ ఘటనపై సమగ్ర విచారణ జరపించాలని ఇటీవలే డీజీపీకి కూడా చంద్రబాబు లేఖ రాశారు. దోషులను పట్టుకుని శిక్షించినప్పుడే పోలీసు వ్యవస్థపై విశ్వసనీయత పెరుగుతుందన్నారు చంద్రబాబు. సీసీ కెమెరాల ఆధారంగా దోషుల్ని పట్టుకునే అవకాశం ఉందని.. కానీ పోలీసులు ఇంతవరకు ఏమీ చెప్పలేదన్నారు చంద్రబాబు.

Tags

Next Story