CBN: కూటమి విజయానికి తిరుగులేదు

CBN: కూటమి విజయానికి తిరుగులేదు
ఇంటి వద్దకే రూ.4 వేల పింఛన్... కుప్పంలో బహిరంగ సభలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని అందుకే ఏపీలో 160 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో NDAను గెలిపించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. తమ పాలనలో హింసా, దౌర్జన్యాలకు తావుండదని స్పష్టంచేశారు. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సంపద సృష్టించి, దాన్ని మహిళలకే పంచుతామని హామీ ఇచ్చారు. వైకాపా నేతల భూదాహానికే సుబ్బారావు కుటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో మంది ఇలా బాధలు పడుతున్నారని చెప్పారు.

కుప్పం పర్యటనలో భాగంగా తెలుగుదేశం నేత అధినేత చంద్రబాబు...బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన..బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల అజెండా అభివృద్ధి, ప్రజస్వామ్య పరిరక్షణ అని చెప్పారు. ఏపీలో NDA అధికారంలోకి వచ్చాక పెద్ద పంచాయతీలకు 2 కోట్లు, చిన్న పంచాయతీలకు కోటి రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. పేదల పింఛను డబ్బును ఇంటివద్దకే తెచ్చి ఇస్తామన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది తమ పార్టీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్‌ బోర్డు ఆస్తులు రక్షించామన్నారు. ప్రతి నియోజకవర్గానికీ ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్త ఎన్నికల పర్యటనకు ముందు కుప్పం ప్రజల ఆశీస్సులు కోరుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కుప్పంలో శీతల గిడ్డంగులు నిర్మిస్తామని కుప్పంలో పండిన కూరగాయలను విదేశాలకు పంపిస్తామన్నారు. భూ రికార్డులు మార్చేసి.... వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, వ్యవస్థల నిర్వీర్యం ఉండదని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. పేదరికంలేని సమాజమే తన లక్ష్యమని చెప్పారు. ద్రబాబు కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం..... వెలుగు చూసింది. చంద్రబాబు బస చేసే వాహనాన్ని జనాలు చుట్టుముట్టగా.... అదుపు చేయటానికి పోలీసులు లేకపోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వచ్చే ఐదేళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు నాదే. వై నాట్‌ 175 అని జగన్‌ అంటున్నారు. వై నాట్‌ పులివెందుల.. అని నేను పిలుపునిస్తున్నా. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను నేనే అభివృద్ధి చేశా. ఆ తర్వాత దాని చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగాయి. రికార్డులు మార్చేసి పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు. వైకాపా నేతల వేధింపుల వల్లే సుబ్బారావు కుటుంబం చనిపోయింది. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చా. భూమి అప్పగిస్తామని చెప్పా. భూముల కోసం ఎన్‌ఆర్‌ఐను వేధించారు. మన భూమి, స్థలాలను కాపాడుకునేందుకు ఇన్ని బాధలు పడాలా? నంద్యాలలో అబ్దుల్‌ సలాం ఎంతో మనోవేదనతో చనిపోయాడు. అరాచకాలకు అడ్డుకట్టవేయాలంటే తెదేపా అధికారంలోకి రావాలి’’ అని చంద్రబాబు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story