Chandrababu Naidu: ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడులోని కృష్ణగిరి, వెల్లూరు జిల్లాలకు అక్రమంగా గ్రానైట్ తరలిపోతోందని, దీనిని అడ్డుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. శాంతిపురం, కుప్పం మండలాల్లో అక్రమంగా తవ్విన గ్రానైట్ రాళ్లను రాత్రి సమయాల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని నదిమూర్, ఓఎన్ కొత్తూరు, మోట్లచేను గ్రామాల మీదుగా తమిళనాడుకు గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోందన్నారు. ఏపీలో రాజకీయ నేతల ప్రమేయంతోనేఈ అక్రమ రవాణా జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. గ్రానైట్ మాఫియా ద్వారా జరుగుతున్న ఈ అక్రమాల్ని తక్షణమే అరికట్టాలన్నారు. రాష్ట్ర ఖజానాకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించాలన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సరిహద్దులో అక్రమ రవాణాను అడ్డుకోవాలని తమిళనాడు సీఎస్‌కు కూడా టీడీపీ అధినేత లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com