నీటి వివాదాలపై చంద్రబాబు, రేవంత్ ఒకే మాట..!

రెండు తెలుగు రాష్ట్రాల నడుమ మంచి వాతావరణం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకే మాట మీదకు వచ్చినట్లు కనిపిస్తోంది. నీటి వాటాల విషయంలో తగువులు ఆడుకుని నష్టపోయేకంటే కలిసి సమస్యలు పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలను అభివృద్ధి పరంగా ముందుకు తీసుకు వెళ్లడానికి ఇద్దరు సీఎంలు సానుకూలంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద వైసిపి నానా కుట్రలు చేసి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూసింది. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం 2021 లోనే ఆగిపోయింది అంటూ చంద్రబాబు నాయుడు ఆధారాలతో సహా బయటపెట్టారు. కేవలం కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి చివరకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో ఎన్జీటీ దాన్ని ఆపేసింది. అప్పుడే ఏపీ ప్రభుత్వానికి 100 కోట్ల ఫైన్ వేసింది ఎన్జీటీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫైన్ డబ్బులను కట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందేమో అనుకున్నారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టు అటకెక్కింది. కానీ జగన్ బ్యాచ్ ఆ విషయాలను దాచిపెట్టి కూటమి ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమాన్ని ఎత్తుకున్నారు.
కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వివాదాన్ని పెంచుకొని నష్టపోయే కంటే.. రెండు తెలుగు రాష్ట్రాలు నీటిని సమృద్ధిగా వాడుకొని అభివృద్ధి చెందాలని కోరారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నాయి కాబట్టే కాలేశ్వరం ప్రాజెక్టుకు, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను కూడా తాను సమర్ధించాను అని తెలిపారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీటిని తాము బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు వాడుకుంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. వివాదాలకంటే తాను అభివృద్ధికి ముగ్గు చూపుతానని చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల నడుమ మంచి సయోధ్యం ఉండి ముందుకు సాగాలని కోరారు. వీరిద్దరి మాటలను చూస్తుంటే ఈ నీటి వివాదం మీద నీళ్లు చల్లినట్టే అనిపిస్తోంది. వైసిపి కోరుకున్నట్టు ఈ వివాదం పెద్దది కాకపోవడంతో ఆ పార్టీ నేతలు అందరూ తెగ బాధ పడిపోతున్నారంట. ఏదో ఒకటి జరుగు కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ టాక్ వస్తే బాగుండు అని జగన్ బ్యాచ్ మొత్తం ఎదురుచూసింది. కానీ వాళ్ల కుట్రలు ఫలించకపోవడంతో తెగ ఫీల్ అయిపోతున్నారట.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

