Chandrababu Naidu : వైసీపీ ఆరాచక పాలనలో 33 మంది టీడీపీ నేతలు హత్య : చంద్రబాబు

Chandrababu Naidu : వైసీపీ ఆరాచక పాలనలో 33 మంది టీడీపీ నేతలు హత్య : చంద్రబాబు
X
Chandrababu Naidu : గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య అంతిమ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

Chandrababu Naidu : గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య అంతిమ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఘటన విషయం తెలిసిన మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడుకు వెళ్లిన చంద్రబాబు... తోట చంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. టీడీపీ కార్యక్రర్తలు పెద్ద ఎత్తున అంత్యక్రియలకు తరలివచ్చారు.

గుండ్లపాడులో టీడీపీ శ్రేణుల నుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. తోట చంద్రయ్య దారుణ హత్యను ఖండించారు. వైసీపీ అరాచక పాలనలో 33 మంది టీడీపీ నేతలను పొట్టన బెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు చేసేది మీరు... తిరిగి వేరే వాళ్లపై నేరారోపణ మోపుతారని జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

మీలాగే మేం అధికారంలో ఉన్నపుడు చేసుంటే ఒక్కరైనా మిగిలేవారా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని, ఆరాచక శక్తులను ప్రోత్సహించడం మానుకోవాలని హితవు పలికారు.

Tags

Next Story