Chandrababu : టీడీపీ ఐటీ ఉద్యోగాలిస్తే.. వైసీపీ చికెన్‌, మటన్‌ షాపుల్లో ఉద్యోగాలిస్తున్నారు : చంద్రబాబు

Chandrababu : టీడీపీ ఐటీ ఉద్యోగాలిస్తే.. వైసీపీ చికెన్‌, మటన్‌ షాపుల్లో ఉద్యోగాలిస్తున్నారు : చంద్రబాబు
Chandrababu : ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. ముందస్తు ఎన్నికల గురించి జోరుగా చర్చ నడుస్తోంది.

Chandrababu : ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. ముందస్తు ఎన్నికల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల గురించి టీడీపీ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. ప్రజల్లో ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరుగుతుందనే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు చూస్తున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ పక్కా క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మేన్ అని విమర్శించిన చంద్రబాబు.. నెత్తిమీద కుంపటిని దించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.

అమ్మఒడి విషయంలో జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశం చట్టం అని ప్రచారం చేశారని, కానీ దానికి ఇంతవరకు చట్టబద్ధత లేదన్నారు. తాము నిర్మించిన పోలీస్ స్టేషన్లకు రంగులు వేసి దిశ పోలీస్‌స్టేషన్లు అంటూ హడావుడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తాడా..? అని జగన్‌ని ఉద్దేశించి ప్రశ్నించారు. జగనన్న బాణాన్ని అంటూ.. ఊరూ వాడా తిప్పారు.. ఇప్పుడు ఆ బాణం హైదరాబాద్‌లో ఉండిపోయిందన్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. బాబాయ్ హత్య విషయమై జగన్ తన చెల్లి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ పథకాలు, విధానాలపైనా చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత అని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో ఆదాయాలు తగ్గుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయని వాపోయారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం.. ఈ జగన్ ప్రభుత్వమని ఆరోపించారు. మహిళల జుట్టు మీద కూడా పన్నేసేలా ఉన్నారని విమర్శించారు. మద్య నిషేధం అని చెప్పి మద్యంలో కొత్త బ్రాండ్లు తెచ్చారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం.. ఐటీ ఉద్యోగాలిస్తే.. వైసీపీ ప్రభుత్వం చికెన్, మటన్ షాపుల్లోఉద్యోగాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అబద్దాల కోరు అన్న చంద్రబాబు.. జగన్ ఆడిన అబద్దాలపై పుస్తకం వేస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి ద్వారా కొంత మేర ఇచ్చి.. నాన్న బుడ్డి ద్వారా మరెంతో లాగేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story