ఆంధ్రప్రదేశ్

Chandrababu Naidu : ఈ విజయం ప్రజా రాజధానిది.. ఐదు కోట్ల ఆంధ్రులది: చంద్రబాబు

Chandrababu Naidu : రాజధాని ఉద్యమ రైతులకు. ప్రజలకు అభినందనలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu Naidu : ఈ విజయం ప్రజా రాజధానిది.. ఐదు కోట్ల ఆంధ్రులది: చంద్రబాబు
X

Chandrababu Naidu ; రాజధాని ఉద్యమ రైతులకు. ప్రజలకు అభినందనలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ విజయం ప్రజా రాజధానిదని... ఐదు కోట్ల ఆంధ్రులదన్నారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. 807 రోజుల పాటు రైతులు ఆందోళనలు చేస్తే అవమానించారని... మహిళలు విరోచితంగా పోరాడారన్నారు. అంతిమంగా ధర్మం గెలుస్తోందని అమరావతి పోరాటం చాటిందన్నారు. తప్పుడు నిర్ణయాలతో జగన్‌ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఇక బాబాయ్‌ హత్యతో జగన్‌ రెండు లక్ష్యాలను నెరవేర్చుకున్నారన్నా చంద్రబాబు. వివేకాను అడ్డు తొలగించుకుని... తనపై బురద జల్లి రాజకీయ లబ్ది పొందారన్నారు. సీబీఐ విచారణ చేస్తే అవినాష్‌ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని జగన్‌ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వివేకా కూతుర్ని కూడా టీడీపీ పావుగా చిత్రీకరిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Next Story

RELATED STORIES