Chandrababu : 2024లో ఓడిపోతే వైసీపీ అనేది ఉండదని జగన్‌కు అర్థమైంది: చంద్రబాబు

Chandrababu : టీడీపీ నియోజవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు.. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు.. 2024లో ఓడిపోతే వైసీపీ అనేది ఉండదని జగన్‌కు అర్థమైందన్నారు.
జగన్ సింహం కాదు పిల్లి అన్న చంద్రబాబు.. భయంతో అందరి కాళ్లు పట్టుకున్న నేత అంటూ ఎద్దేవా చేశారు.. ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ బలహీనతకు నిదర్శనమన్నారు.. భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అన్న స్లోగన్స్‌ను జై జగన్ అన్నట్లుగా మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా ఏకం కావాలన్న తన వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారన్నారు.. ఇక గ్రామస్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించాలని నేతలకు సూచించారు.. అలాగే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని మండల అధ్యక్షులకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com