Chandrababu Naidu : ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి దారుణ ఓటమి తప్పదు : చంద్రబాబు

Chandrababu Naidu : టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కమిటీలు, కార్యక్రమాలపై నేతలతో చర్చించారు.. వైసీపీ పాలనలో ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు.. ముఖ్యమంత్రి నిర్ణయాలతో నష్టపోని వర్గమంటూ లేదన్నారు.
స్థానిక సమస్యలపై టీడీపీ స్థానిక నాయకత్వం పోరాటాలు పెంచాలని సూచించారు.. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి దారుణ ఓటమి తప్పదన్నారు.. భవిష్యత్తులో తమకు ఓటమి తప్పదని వైసీపీ వర్గాల్లోనే క్లారిటీ వచ్చిందన్నారు.. పీఆర్సీ విషయంలో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగుల పోరాటాలకు టీడీపీ మద్దతిస్తుందని చంద్రబాబు చెప్పారు.
టీడీపీకి ఓటు వేశారా లేదా అన్నది ఎప్పుడూ చర్చ కాదని, బాధిత వర్గం ఎక్కడున్నా టీడీపీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సమన్వయంతో బాధితులను ఆదుకోవాలని సూచించారు.. ఇక వీడియో కాన్ఫరెన్స్‌లో తమ అధినేత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు టీడీపీ నేతలు.
మీరు ఎలా ఉన్నారని అడగ్గా కరోనా నుంచి కోలుకున్నానని, తాను పర్ఫెక్ట్‌గా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. రెండో రోజు నుంచే యధావిధిగా ఆన్‌లైన్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చంద్రబాబు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com