Chandrababu Naidu : టీడీపీలో ప్రక్షాళన తప్పదా.. చంద్రబాబు సీరియస్ యాక్షన్..?

Chandrababu Naidu : టీడీపీలో ప్రక్షాళన తప్పదా.. చంద్రబాబు సీరియస్ యాక్షన్..?
X

టీడీపీ పార్టీలో క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీ పడేది లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు సీరియస్ గా చెప్పారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని.. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని హింట్ ఇస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో ఇప్పటికే క్రమశిక్షణా కమిటీ సమావేశం అయింది. ఆయన్ను విచారించింది. మధ్యాహ్నం కేశినేని చిన్నిని విచారించారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత పార్టీ అధినేత సీఎం చంద్రబాబుకు నివేదిక ఇస్తారు. దానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని చక్కదిద్దాం కాబట్టి ఇక పార్టీలో క్రమశిక్షణ, ప్రక్షాళన మొదలు పెడుతామని ఇప్పటికే చంద్రబాబు తెలిపారు.

ఈ క్రమంలోనే పార్టీలైన్ దాటుతున్న ఎమ్మెల్యేపై దృష్టి పెట్టారు. ఈ రోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో అనేక మంది మంత్రి లోకేష్ కు వినతి పత్రాలు ఇచ్చారు. ఆయనే స్వయంగా కలిశారు. వేల మంది రావడంపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే స్వయంగా లోకేష్, చంద్రబాబుకే వినతి పత్రాలు ఇస్తేనే సమస్యలు పరిష్కారం కావడం ఏంటి.. సీఎంఆర్ ఎఫ్‌ బిల్లుల కోసం కూడా రావడం ఏంటి.. అంటే ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదా.. వాళ్లు పనిచేస్తే లోకేష్‌ దాకా రావాల్సిన అవసరం ఉండదు కదా. ప్రతి ఒక్కరితో లోకేష్ కలిసి మాట్లాడలేరు కదా. ఇది పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా వ్యతిరేకత తీసుకొస్తుందనే విషయంలో చంద్రబాబు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల పనితీరుపై కీలక చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత ఏర్పడి అప్పుడు టీడీపీ ఓడిపోయింది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై కార్యకర్తల అసంతృప్తి వల్లే టీడీపీ ఓడిపోయింది. కాబట్టి అలాంటి పరిస్థితి మరోసారి రావొద్దని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు కచ్చితంగా పార్టీ లైన్ కిందే పనిచేయాలని.. కార్యకర్తల సమస్యలను, ప్రజల సమస్యలను తీర్చాలని ఆదేశాలు ఇస్తున్నారు. అతి త్వరలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు గట్టి యాక్షన్ తీసుకుంటారని తెలుస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని.. మరోసారి కూటమి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన.


Tags

Next Story