Chandrababu Naidu : ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ముందుకు వెళ్తుంది : చంద్రబాబు

Nara chandrababu Naidu (File Photo)
Chandrababu Naidu : అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో కుదరదని ఏపీ విపక్ష నేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పరిషత్ ఎన్నికల విషయంలో కోర్టు తీర్పు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్న ఎస్ఈసీ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కోర్టు సైతం ఎస్ఈసీ అర్హతను ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాదేశిక ఎన్నికలను ఇష్టారాజ్యంగా నిర్వహించాలని సర్కారు భావించిందని, ఆ అరాచకాలు భరించలేకే తాము ఈ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు అన్నారు. నామినేషన్ ల దగ్గరి నుంచి పోలింగ్ వరకు అన్ని దశల్లోనూ దుర్మార్గంగా వ్యవహరించారని నిప్పులు చెరిగారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడానికి సర్కారుకు లేదని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చంద్రబాబు చురకలు అంటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com