Chandrababu : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి ఘటన రాష్ట్రానికే అవమానం: చంద్రబాబు

Chandrababu : జగన్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. ఆమె కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
తన కూతురు కనిపించడంలేదని తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదన్నారు. ఇంకా ఎంత మంది ఆడబిడ్డలపై అత్యాచారం జరిగితే ఈ ప్రభుత్వం మేల్కొంటుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
బాధితురాలి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదన్నారు చంద్రబాబు. ఇది అసమర్థ ప్రభుత్వమని.. చిత్తుశుద్ధి లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎవరి ఆస్తులకూ రక్షణ లేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని తగలబెడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి ఘటన రాష్ట్రానికే అవమానమన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com