తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్.. !

Nara chandrababu Naidu (File Photo)
టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రచార వ్యూహాలను సిద్ధం చేసిన చంద్రబాబు.. నారా లోకేష్, అచ్చెన్నాయుడు సహా సీనియర్ నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. అలాగే ఎన్నికల వ్యవహారాన్ని సమన్వయ పరిచే బాధ్యతను వర్ల రామయ్య, బోండా ఉమా, టిడి.జనార్దన్‌కు అప్పగించారు.
పక్కా వ్యూహాలతో తిరుపతి ఉప ఎన్నికలకు వెళ్తున్న టిడిపి అధినేత చంద్రబాబు.. రోజువారి కార్యక్రమాలపైన దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ప్రతిరోజు స్థానిక వర్గాల నుంచి ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయానికి ఫీడ్‌బ్యాక్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక న్యాయవాదిని అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి సహకరించే వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులపై లీగల్ సెల్ ద్వారా ఫిర్యాదులు చేయాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు స్థానిక సమస్యలను ప్రస్తావించేలా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com