నేడు చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు ... తిరుమలలో నేడంతా అన్నదాన కార్యక్రమం

నేడు చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు ... తిరుమలలో నేడంతా అన్నదాన కార్యక్రమం
Nara Devansh : టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఈరోజంతా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు.

Nara Devansh : టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఈరోజంతా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. తరిగొండ వెంగమాంబ నిత్యప్రసాద భవనంలో ఈ రోజు దాత మాస్టర్‌ నారా దేవాన్ష్‌ అనే పేరుతో ఒక్క రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిత్యాన్నదాన వితరణకు అయ్యే 30 లక్షల వ్యయాన్ని టీటీడీ ఎస్పీ అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబు విరాళమిచ్చారు. అన్నప్రసాదాలను వడ్డించాలని టీటీడీని కోరారు. దేవాన్ష్‌ పుట్టినరోజున ప్రతి ఏటా తిరుమలలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చంద్రబాబు కుటుంబం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story