Chandrababu: ఇకపై సంప్రదాయ రాజకీయాలు నడవవు.. ఢీ అంటే ఢీ అనే అభ్యర్ధుల్ని దించుతాం : చంద్రబాబు

Chandrababu Naidu : ఇకపై సంప్రదాయ రాజకీయాలు నడవవన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఢీ అంటే ఢీ అనే అభ్యర్ధుల్ని మాత్రమే రంగంలో దించుతామన్నారు. నామినేషన్లు విఫలమైనా, ఓటమి పాలైనా ముఖ్యనేతలదే బాధ్యత చేస్తామన్నారు. ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉన్న 22 మున్సిపల్ కార్పొరేషన్ల ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు పనిచేసి వారిని విస్మరించి.... కొత్త వారిని ప్రోత్సహించారని ఇప్పుడు వారంతా ప్రత్యర్ధుల పక్షాన చేరిపోయారన్నారు.
కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేసి వారిని పక్కన బెట్టారన్న చంద్రబాబు.... అడుగులకు ముడుగలొత్తే వారికి నామినేటెడ్ పదవులు వచ్చేలా వ్యవహరించారన్నారు. ఆయాచితంగా పదవులు పొందిన వారు అధికారం పోగానే ప్రత్యర్ధుల పక్షాన చేరిపోయారన్నారు చంద్రబాబు. కొందరు నేతలు స్థానిక ఎన్నికలను నిర్లక్ష్యం చేస్తున్నారని... ఇలా నిర్లక్ష్యం చేసిన నేతల వల్లే పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న చోట గట్టిపోటీ ఇచ్చామని, కొన్ని చోట్ల గెలిచామన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com