Chandrababu Naidu : రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు..!

Chandrababu Naidu : మంగళవారం ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిత్యావసర సరుకుల ధరల తగ్గింపు కోసం ఆందోళనలు నిర్వహించాలన్నారు. "ధరలు దిగిరావాలి....జగన్ దిగిపోవాలి" పేరుతో నిరసనలు చేపట్టాలన్నారు. అమరావతిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు చంద్రబాబు. PRCని పున:సమీక్షించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. రాజధానిలో 29 గ్రామాలు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటును తప్పుబట్టారు చంద్రబాబు. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైసీపీ డిఫెన్స్ లో పడిందన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో..... వైసీపీ క్యాడర్, లీడర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు చంద్రబాబు.
మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో మైనింగ్ దోపీడి జరుగుతోందని ఆరోపించారు చంద్రబాబు. వైసీపీ నేతల దోపిడీపై పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్రమాలకు పాల్పడుతున్న పెద్దిరెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు. మైనింగ్, మద్యం, శాండ్, ల్యాండ్ మాఫియా ద్వారా వైసీపీ నేతలు ఇప్పటికే వేలకోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. చివరకు నాడు-నేడు కార్యక్రమాల్లోనూ అవినీతి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com