AP: ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు

తెలుగుదేశం (TeluguDesam) అధినేత చంద్రబాబు (Chandra Babu) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah), బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో భేటీ య్యారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాత్రి పొద్దుపోయాక షా,నడ్డాలతో భేటీ అయ్యారు. నేడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన కూడా షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో... బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురూ సమావేశమయ్యారు. NDA భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో...తెలుగుదేశాన్ని NDA కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. నడ్డా, షాలతో రాత్రి ఏడున్నరకు భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయేవరకూ పార్లమెంటు ఉభయసభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంటులోనే ఉండిపోయారు. దాంతో రాత్రి 11.25 గంటలకు చంద్రబాబు వారితో సమావేశం అయ్యారు. బీజేపీ నాయకత్వం NDA పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది.
ఇటీవల NDA కూటమిలోకి వచ్చిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు షా, నడ్డాలతో భేటీ అయ్యారు. తర్వాత కమల నాథులు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఇవి ప్రాథమిక చర్చలు కావొచ్చని, ఇందులో పొత్తులపై ఇరుపార్టీల పెద్దలు ప్రాథమిక అవగాహనకు రావొచ్చన్న భావన ఉంది. అయితే దీని గురించి ఇరుపార్టీల నేతలెవ్వరూ అధికారికంగా స్పందించలేదు. కేంద్రంలో అత్యధిక మెజారిటీతో గెలవడం బీజేపీకు ఎంత ముఖ్యమో, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడం తెలుగుదేశంకు చారిత్రకంగా అంతే ముఖ్యం. కాబట్టి ఇరుపార్టీల మధ్య ఆదిశలోనే చర్చలు జరిగుండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు... ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు.
తర్వాత ఆయన హోటల్‌కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి గల్లా ఇంటికి చేరుకుని...పార్టీ ఎంపీలు, ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు.ఇటీవల వైసీపీ రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం రాత్రి ఢిల్లీలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన ఇప్పటివరకూ తెలుగుదేశంలో అధికారికంగా చేరకున్నా ఇలా వచ్చి కలవడం ప్రాధాన్యం సంతరించుకొంది. తెలుగుదేశం ఎంపీలతో పాటు ఆయన కూడా చంద్రబాబుతో జరిగిన ఇష్టాగోష్టి చర్చల్లో పాల్గొన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమిత్‌షాను కలిశారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఢిల్లీ వెళ్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com