ప్రజల దృష్టి మళ్లించేందుకే మూడు రాజధానుల ఉపసంహరణ : చంద్రబాబు

Chandrababu Naidu : సీఎం జగన్ తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో సమస్యలు, వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నట్లు నాటకం ఆడారన్నారు. 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప రెండున్నరేళ్లలో ఈ మూడు ప్రాంతాల్లో పైసా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మహిళలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యక్తిగత దుర్భాషల్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లిచేందుకే ఈ 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నారన్నారు చంద్రబాబు.
టీడీపీ హయంలో జరిగిన అభివృద్ధి తప్ప జగన్ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం మాత్రం.. పక్కరాష్ట్రాల్లో పెళ్లి విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పథకాలు ఆపేస్తామంటే భయపడొద్దన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు రానివ్వకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని.... . పథకాలు ఆపేస్తే న్యాయస్థానంలో పోరాటం చేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com