గుంటూరు జిల్లాకు చెందిన దళిత కుటుంబంతో మాట్లాడిన చంద్రబాబు

గుంటూరు జిల్లాకు చెందిన దళిత కుటుంబంతో మాట్లాడిన చంద్రబాబు

గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నయపాలెం గ్రామానికి చెందిన దళిత కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు ధైర్యం చెప్పారు.. ఇటీవల పార్టీ మారాలని ఒత్తిడి చేస్తూ.. తనను కిడ్నాప్‌ చేసి.. తరువాత రక్తం కారాలే చావ బాదారు అంటూ రైతు యలమంద నాయక్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. అతడి భార్య శౌరీబాయ్‌ కూడా మీడియా ముందుకు వచ్చారు.. పార్టీ మారాలి అంటూ వైసీపీ నేతలు డబ్బులు ఆఫర్‌ చేశాని.. అయితే ప్రాణం పోయినా పార్టీ మారమంటూ చెప్పామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే తమను వేధింపులకు గురి చేశారంటూ ఆ దంపతులు వాపోయారు.

వారి ఆవేదన విన్న టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.. వారితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కిడ్నాప్‌ చేసి.. దాడి చేసిన వారికి శిక్షలు పడే వరకు పోరాటం చేస్తానని.. అన్ని విధలా ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సంఘటన జరిగిన విధానం అడిగి తెలుసుకున్నారు.


Tags

Next Story