Chandrababu: కడప జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర

Chandrababu:  కడప జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు శనివారం ప్రొద్దుటూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ల్లో చంద్రబాబు రోడ్ షోలు, ప్రజాగళం సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయగిరిలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ప్రజాగళం భహిరంగ సభలో పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో నిర్వహించిన భారీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏంచేశావు? అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రాయలసీమకు నీరు అందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు అని విమర్శించారు. కానీ తెలుగదేశం పార్టీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అని ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ట్యాంకు నిండుగా ఉంటే, కుళాయి తిప్పతే నీళ్లు వస్తాయి, అదే ట్యాంకులో నీళ్లు లేకపోతే, కుళాయి తిప్పినప్పుడు అడుగున ఉన్న ఉన్న బురద వస్తుంది. ఈ దోపిడీదారుడు జగన్ మోహన్ రెడ్డి ఆ పరిస్థితి తీసుకువచ్చాడు.

జగన్ కు సంపద సృష్టించడం తెలియదు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే కొన్ని వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. తద్వారా వాళ్ల కొనుగోలు శక్తి పెరిగేది. దాంతో, పరోక్షంగా మరింతమందికి ఉపాధి కలిగేది. నేను కియా మోటార్స్ విషయంలో అదే చేశాను. నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ కు నేనే ప్రారంభోత్సవం చేశాను. కరవుసీమ అనంతపురంలో తయారైన కియా కార్లు ప్రపంచమంతా పరుగులు తీస్తున్నాయంటే అదీ తెలుగుదేశం పార్టీ విజన్.

అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ను రాయలసీమకు తీసుకువచ్చాను... అది నా బ్రాండ్. ఓసారి శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ కే మళ్లీ శంకుస్థాపన చేయడం జగన్ బ్రాండ్. ప్రజలను మోసం చేయడం, పరిశ్రమలను తరిమివేయడం జగన్ బ్రాండ్. నేను జాకీ పరిశ్రమను తీసుకువస్తే, అది ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి కల్పించారు. అమరరాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. కప్పం కట్టలేక, వీళ్ల దౌర్జన్యాలు భరించలేక పరిశ్రమలు పారిపోతే యువతకు ఉద్యోగాలు వస్తాయా?

Tags

Read MoreRead Less
Next Story