Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏలూరు ఘటన ముఖ్యమైన...

ఏలూరు ఘటన ముఖ్యమైన సమస్యగా ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? : చంద్రబాబు

ఏలూరు ఘటన ముఖ్యమైన సమస్యగా ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? : చంద్రబాబు
X

ఏపీ ప్రభుత్వానికి అప్పులు చేయటం, ఆస్తులు అమ్మటం, పన్నులు వసూలు చేయటంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏలూరు ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. ఇది ముఖ్యమైన సమస్యగా ముఖ్యమంత్రికి కనిపించలేదా అని ప్రశ్నించారు. వ్యవస్థలను నాశనం చేయటం వల్లే ఈ ఇబ్బందులన్నారు. ప్రజలంతా భయపడుతుంటే చీమ కుట్టినట్లైనా లేదని.. ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించలేదని ప్రశ్నించారు చంద్రబాబు. కారణాలు తెలియవని వాదించడం వింతగా ఉందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ప్రజలకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే.. ఇతర ప్రాంతాల పరిస్థితి ఏమిటన్నారు. తెలుగుదేశంపై దాడి చేయటం, నేతలపై అక్రమ కేసులు బనాయించటంలో చూపిన శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదన్నారు. వాటర్ గ్రిడ్‌ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.


Next Story