ఆంధ్రప్రదేశ్

Chandrababu: ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు..

Chandrababu: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు..
X

Chandrababu: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో.. ఆదివాసీ దినోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు.. జగన్‌ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వెదవ పని చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఆంబోతులు బటలిప్పి తిరుగుతుంటే.. చూస్తూ ఉండాల్సి వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేసిన వారిని సీఎం మందలించి దండిస్తే.. మిగిలిన వాళ్లకూ భయం వస్తుందన్నారు చంద్రబాబు. జగన్‌ రెడ్డి ఉదాసీనత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు, భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని ఫైర్‌ అయ్యారు. రౌడీలో పోలీసుల్ని చంపే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దుర్మార్గమన్నారు చంద్రబాబు. వంగలపూడి అనితకు వైసీపీ నేత ఫోన్ చేసి బెదిరించడాన్ని చంద్రబాబు ఖండించారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక పత్రికలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి కూడా తన గురించి మాట్లాడుతారని సజ్జలకు చురకలంటించారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలోనూ వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందన్నారు. పాఠశాలల విలీనంలోనూ ప్రభుత్వం తప్పులు చేసిందన్నారు. పేద విద్యార్థుల విద్యావకాశాలకు గండికొట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు

గిరిజనులు హక్కుల పరిరక్షణ కోసం ఎన్టీఆర్‌ జీవో 3 తీసుకొస్తే.. జగన్‌ ప్రభుత్వం దీన్ని కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి భారతి సిమెంట్‌కు తరలిస్తూ గిరిజన సంపదను జగన్‌రెడ్డి దోచుకుంటున్నారంటూ ఫైర్‌ అయ్యారు. గిరిజనుల కోసం టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 18 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్‌ సర్కారు రద్దు చేసిన అన్ని కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు చంద్రబాబు.

Next Story

RELATED STORIES