వైసీపీని కృష్ణానదిలో ముంచాలి: చంద్రబాబు

వైసీపీని కృష్ణానదిలో ముంచాలి: చంద్రబాబు
సమాజాన్ని నాశనం చేసే వైసీపీ జెండాను ఎవ్వరూ మోయొద్దని పిలుపునిచ్చారు

వైసీపీకి ఇదే చివరి సంవత్సరం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సమాజాన్ని నాశనం చేసే వైసీపీ జెండాను ఎవ్వరూ మోయొద్దని పిలుపునిచ్చారు. వైసీపీ జెండాను కృష్ణా నదిలో ముంచేసి.. ప్రతి ఒక్కరూ టీడీపీ జెండా పట్టుకోవాలన్నారు. కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇంటికి సైకో స్టిక్కర్ అతికించటం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. జగన్‌ పాలనలో ఆడబిడ్డల జీవితాలు చితికిపోయాయని.. జగన్‌ క్యాన్సర్ మాదిరి సమాజాన్ని పట్టి పీడిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఏ రౌడీనీ వదిలిపెట్టనని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story