CM : సభ్యత్వ నమోదు ప్రారంభించిన చంద్రబాబు

CM : సభ్యత్వ నమోదు ప్రారంభించిన చంద్రబాబు
X

తెలుగు దేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో ప్రారంభించారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు లాంఛనంగా స్టార్ట్‌ చేశారు. లక్ష రూపాయలు కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందించారు. ఇక వంద చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు పది వేల రూపాయలు అందించనున్నారు. కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తామన్నారు. సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నేతలు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలని చంద్రబాబు కోరారు.

Tags

Next Story