మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.పుత్తా ఎస్టేట్‌ ప్రాంగణంలో ఐదు నియోజకవర్గాల ఇంఛార్జులతో జరిగే సమావేశంలో బాబు పాల్గొంటారు

టీడీపీ అధినేత చంద్రబాబు మూడు జిల్లాలో పర్యటించనున్నారు. మొదటగా ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలోని పుత్తా ఎస్టేట్‌ ప్రాంగణంలో ఐదు నియోజకవర్గాల ఇంఛార్జులతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశంలో 35 మంది పార్టీ ఇంఛార్జులతో భేటీ కానున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలపై నేతలతో చర్చించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ జోన్-5 సమావేశానికి ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన.. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, క్లస్టర్లు, మండలాధ్యక్షులు హాజరుకానున్నారు. అటు కడప దర్గాను సందర్శించి ఇఫ్తార్‌ విందులో పాల్గొననున్న చంద్రబాబు.. బద్వేలులో బిజీ వేముల ఇంట రాత్రి బస చేయనున్నారు.

మూడు జిల్లాల్లో పర్యటిస్తుండటంతో చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించాలంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు డీజీపీకి లేఖ రాశారు. లెటర్‌లో చంద్రబాబు పర్యటన వివరాలను తేదీలతో సహా పేర్కొన్నారు. చంద్రబాబు సమావేశాలపై రాజకీయ ప్రత్యర్థులు, అ సాంఘీక శక్తులు టార్గెట్‌ చేసే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఎలాంటి ఆటంకా లు కల్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రేపు ప్రకాశం జిల్లా గిద్దలూరు, 20న మార్కాపురం, 21న ఎర్రగొండపాళెంలో పర్యటించించనున్నారు. ఈ నెల 20న చంద్రబాబు పుట్టినరోజు కావడంతో మార్కాపురం పర్యటనకు ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు డీజీపీకి రాసిన లేఖలో వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story