నేడు ప్రకాశం జిల్లాలో బాబు పర్యటన

నేడు ప్రకాశం జిల్లాలో బాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమవుతారు. వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని నిర్వహించే కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో నాయకుల పని తీరు, ఆశావహులకు బాబు భరోసా వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. దివంగత నేత బీ. వీరారెడ్డి కి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం వరకు ఆయన బద్వేల్ వీరా రెడ్డి కన్వెన్షన్ లోనే ఉంటారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్, గిద్దలూరుకు చేరుకొని అక్కడ నుండి రాచర్ల గేట్, ఆర్టీసీ డిపో మీదగా వినూత్న విద్యా నికేతన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో కూడా చంద్రబాబు పాల్గొంటారు.

20వ తేదీన సాయంత్రం కంభం రోడ్ జంక్షన్ నుండి చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. క్లాక్ టవర్ మీదగా ఎన్టీఆర్ సర్కిల్, ఎస్కేవీపీ కాలేజి గ్రౌండ్ వరకు చేరుకొని బహిరంగ సభ లో పాల్గొంటారు. 21వ తేదీన యర్రగొండపాలెం టీడీపీ ఆఫీసు సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం రాళ్ళ వాగు వరకు రోడ్ షో నిర్వహించే అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మార్కాపురం డివిజన్ లో చంద్రబాబు పర్యటనకు.. భారీ ఏర్పాట్లు చేసింది టీడీపీ. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కేడర్ మొత్తం కదిలింది. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ఇప్పుడు చంద్రబాబు కోసం జనం ఎదురు చూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story