Chandrababu Tweet: కాస్త ఆలోచించండయ్యా...!

X
By - Chitralekha |19 Jan 2023 12:57 PM IST
థింక్ ఏపీ థింక్ అంటూ చంద్రబాబు ట్వీట్; రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించిన తేదేపా అధ్యక్షుడు...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 'థింక్ ఏపీ థింక్' అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ఓ పోస్ట్ చేశారు.
సత్తెనపల్లి బాధితుల ఆర్ధిక సాయంలో వాటా కొట్టేయడంపై ఉన్న శ్రద్ధ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను కట్టడంలో లేదని మంత్రులపై మండిపడ్డారు. ఇంత వివాదం జరిగినా ఆ బాధిత కుటుంబానికి ఇంకా నష్టపరిహారం అందనేలేదని దుయ్యబెట్టారు. బాధితలకు సాయం అందించేందుకు లంచాలు తీసుకోవడంపై మండిపడ్డారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై వస్తున్న కధనాలను ప్రస్తావిస్తూ వీళ్లయ్యా మంత్రులు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com