కళాకారుడైన పార్టీ అభిమానికి చంద్రబాబు రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం

గత నలబై సంవత్సరాలుగా పార్టీపై అభిమానంతో ప్రతిమలు తయారుచేస్తూ తన జీవనాన్ని కోనసాగిస్తున్న కంభం వాసి సయ్యద్ హుస్సేన్ పీరాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్ధిక సహాయం చేశారు. స్వయంగా పిలిపించుకొని ఆయనని అభినందించి రెండు లక్షల రూపాయలను ఆర్ధిక సహాయంగా అందజేశారు. తనకు వచ్చే ఫించనుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ..మిగిలిన డబ్బులతో పార్టీ ప్రతిమలు తయారు చేస్తూ పార్టీ అభిమానులకు, నాయకులకు ఉచితంగా పంపిణీ చేస్తూ పార్టీపై తన అభిమానం చాటుకున్నారని చంద్రబాబు ప్రశంసించారు.
సయ్యద్ సేవలు కొనియాడదగినవని అన్నారు. వయసు పై బడిన ఇంకా పార్టీకి సేవ చేసే ఇలాంటి కళాకారులు ఉండటం పార్టీ అదృష్టమని అన్నారు. కాగా టీడీపీ ఆవిర్జావం నుంచి పార్టీకి సేవలందిస్తున్నారు సయ్యద్.. కంభం పట్టణ ప్రెసిడెండ్ గా, రామదండు కార్యకర్తగా, మార్కాపురం డివిజన్ పరిశీలకుడిగా, మండల కన్వినర్ గా, టీడీపీ అధ్యక్షుడిగా సేవలను అందించారు సయ్యద్.. ఆయనే కాదు.. ఆయన కుమారుడు నూరుల్లాఖాద్రి సైతం పార్టీకి విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కంభం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com