Chandrababu : తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..

Chandrababu : తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..
శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ...

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు బాబు పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ అధినేత పర్యటించనున్నారు. రేపు వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు రాత్రికి బాపట్లలోనే బస చేయనున్నారు. శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకోనున్నారు. రైతులను పరామర్శించి వారికి చంద్రబాబు ధైర్యం చెప్పనున్నారు.

మిగ్‌జాగ్ తుపాన్ ధాటికి ఏపీలో పలు జిల్లాలు అతలాకుతలం అయిపోయింది. రైతన్నపై మిగ్‌జాగ్ విరుచుకుపడింది. వేలాది ఎకరాల్లో పంటలను నీటి మనిగిపోయాయి. రైతన్న ఆవేదన అంతా ఇంతా కాదు. పెట్టుబడులు పెట్టి కష్టపడి పండించిన పంట నీటమునిగి ఎందుకు పనికిరాకుండా పోవటంతో అల్లాడిపోతున్నారు. మరోపక్క ఈ తుపాను తీవ్రతకు ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారు.

దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించేందుకు సిద్ధమయ్యారు. కష్టాల్లో ఉన్నవారిని పరామర్శించేందుకు వారికి ధైర్యం కల్పించేందుకు తుపాను ప్రబావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు పొన్నూరు,వేమూరు,తెనాలి,బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటించి రేపు రాత్రికి బాపట్లలోనే బస చేయనున్నారు.అలాగే..శనివారం పర్చూరు,పత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటించి తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. నష్టపోయిన రైతులను నేరుగా కలుసుకుని వారి పరిస్థితులను తెలుసుకోనున్నారు.

Tags

Next Story