వైసీపీ నేతలు తిన్నదంతా కక్కిస్తా: చంద్రబాబు

వైసీపీ నేతలు తిన్నదంతా కక్కిస్తా: చంద్రబాబు
అవినీతి సీఎం జగన్‌పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

అవినీతి సీఎం జగన్‌పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీది అవినీతి ప్రభుత్వమని బీజేపీ పెద్దలే చెప్పారని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాలన తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. కుప్పంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్‌ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కొండలు-గుట్టలు మింగేస్తున్నారని భగ్గుమన్నారు. డబ్బంతా దోచేసి విదేశాల్లో దాచిపెడుతున్నారని వైసీపీ నేతలు తిన్నదంతా కక్కిస్తామని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story