ఆంధ్రప్రదేశ్

Chandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను జతచేసి..

Chandrababu: సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ కేసులు పెట్టడంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను జతచేసి..
X

Chandrababu: సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ కేసులు పెట్టడంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఐడీ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ.. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావు ఇళ్ల వద్ద సీఐడీ అధికారులు అర్ధరాత్రి చేసిన దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలను లేఖకు జతచేశారు.

వెంకటేష్, సాంబశివరావును అక్రమంగా అదుపులోకి తీసుకున్న సీఐడీ.. వారిని వేధించిందని ఆరోపించారు. అర్ధరాత్రి ఇంటి గోడలు దూకి, తలుపులు పగలగొట్టి మరీ నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు చంద్రబాబు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో అక్రమంగా చొరబడి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని డీజీపీకి ఫిర్యాదు చేశారు.

అక్రమంగా కస్టడీలోకి తీసుకుని, గంటల తరబడి స్టేషన్‌లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి దాడికి పాల్పడడం దారుణమన్నారు. విచారణ గదిలో ఎలాంటి సీసీ కెమెరాలు కూడా లేవన్నారు చంద్రబాబు. వెంకటేష్, సాంబశివరావును అరెస్ట్ చేసే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని, సుప్రీం తీర్పునకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు.

కొందరు కళంకిత అధికారుల సహకారంతో.. ప్రభుత్వమే ప్రతిపక్షాలను రాజకీయ వేధింపులకు గురిచేస్తోందన్నారు చంద్రబాబు. టీడీపీ శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని, చిత్ర హింసలు పెట్టాల్సిన అవసరం సీఐడీ అధికారులకు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. నేరపూరిత కుట్రలకు పాల్పడిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకొని.. బాధితులకు అండగా నిలవాలని డీజీపీ కసిరెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES