Chandrababu: కేంద్ర జలశక్తిమంత్రికి చంద్రబాబు లేఖ.. పోలవరం ప్రాజెక్టు కోసం..

Chandrababu: జగన్ సర్కారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేంద్ర జలశక్తి మంత్రికి చంద్రబాబు లేఖ రాసారు. పోలవరం ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు జరిగిన నష్టం, డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గల కారణాలు, ప్రాజెక్టుపై వైసీపీ వైఖరి వంటి విషయాలను లేఖలో ప్రస్తావించారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడం పట్ల వైసీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు.
ప్రాజెక్టు పనులు మధ్యలో నిలిచిపోయిన కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం మరో కంపెనీకి అప్పగించిందని చంద్రబాబు మండిపడ్డారు. ఆకస్మికంగా పనుల నిలిపివేతతో కొత్త ఏజెన్సీ పనులకు 6 నెలల సమయం పట్టిందని, పనులు చేపట్టకపోవడం వల్లనే డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నదన్నారు. పనుల ఆలస్యంపై వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ హెచ్చరించిందని తెలిపి చంద్రబాబు.. కేంద్రం చొరవతో పోలవరం ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com