Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ.. గ్రూప్-1 ఉద్యోగాల విషయంలో..

X
By - Divya Reddy |13 Jun 2022 6:00 PM IST
Chandrababu: సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Chandrababu: సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పబ్లిక్ కమిషన్ నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్-1 ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై లేఖలో వివరించారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కొండంత ఆశలతో ఎదురు చూస్తున్నారన్న ఆయన.. గ్రూప్-1 ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా తేదీల ప్రకటన నుంచి.. ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com