టీడీపీ నేతల జంట హత్యలపై డీజీపీకి చంద్రబాబు లేఖ..!

X
By - Gunnesh UV |1 Aug 2021 4:30 PM IST
కర్నూలు జిల్లా పెసరవాయిలో జరిగిన టీడీపీ నేతల జంట హత్యలపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.
కర్నూలు జిల్లా పెసరవాయిలో జరిగిన టీడీపీ నేతల జంట హత్యలపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. జూన్17న కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల్ని ప్రత్యర్ధులు దారుణంగా నరికిచంపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేదంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు, సాక్షులకు రక్షణ కల్పించాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com