చంద్రబాబు పనితీరు అదుర్స్.. ఏపీ ప్రజల మాట

విపత్తు ఏదైనా.. సమస్య ఏదైనా సరే.. తెలుగువారు ప్రమాదంలో ఉన్నారంటే చాలా చంద్రబాబు నాయుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారికోసం పరుగులు పెడుతుంటారు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా స్పందించారో చూసాం.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో చర్యలు తీసుకుంటారో చూస్తున్నాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చార్ధామ్ లో తెలుగు యాత్రికులు ప్రమాదంలో చిక్కుకుంటే అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా సరే తనకెందుకులే అని వదిలేయకుండా ప్రత్యేకంగా ఫ్లైట్స్ పెట్టి వారిని క్షేమంగా ఏపీకి రప్పించారు. 2014-19 హయాంలో హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన ముందస్తు చర్యలు తీసుకుని.. ఆ భారీ నష్టాన్ని ఎలా పూడ్చారో చూశాం.
గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా గులాబ్ తుఫాన్ వచ్చింది. అప్పుడు కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి తనకెందుకులే అని అసలు అనుకోలేదు. జగన్ సీఎంగా ఉండి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాకపోయినా సరే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య తిరుగుతూ వారికి భరోసా కల్పిస్తూ వారికి అన్ని రకాల వసతులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇప్పుడు సీఎంగా ఉండి ఇంత పెద్ద మొంథా తుఫాన్ వస్తే అత్యంత వేగంగా స్పందించి.. ముందస్తు చర్యలు భారీ ఎత్తున తీసుకున్నారు. తన అనుభవాన్ని అంతా రంగరించి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సపోర్టుతో అధికారులను పరుగులు పెట్టించారు. అన్ని రకాల చర్యలను తీసుకొని నష్టాన్ని అత్యంత వేగంగా పూడ్చారు. మరీ ముఖ్యంగా ఒక్క ప్రాణం కూడా పోకూడదు అని చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి.
విపత్తులను ఆపడం ఎవరి తరం కాదు.. కానీ వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నం అనేది ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయుడు ముందస్తు జాగ్రత్తల వల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. పైగా జరిగిన ఆస్తి నష్టాన్ని అత్యంత వేగంగా పూడ్చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూశారు. అసలు ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెళ్లిందా లేదా అనే తేడా మాత్రం అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే అధికారులు అంత వేగంగా స్పందించి పనులు చేసేలా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ వయసులోనూ క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా అర్థరాత్రి వరకు అధికారులతో సమీక్షలు నిర్వహించి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. పునరావాస కేంద్రాలను పరిశీలిస్తూ ఇంత గొప్ప చర్యలు తీసుకోవడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పనితీరు ఎప్పుడైనా అదుర్స్ అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

