Home
 / 
ఆంధ్రప్రదేశ్ / వైసీపీ సర్కారు తీరుపై...

వైసీపీ సర్కారు తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు

వైసీపీ సర్కారు తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు
X

వైసీపీ సర్కారు తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ముందుగానే మద్దతు ధర ప్రకటించి.. వ్యవసాయాన్ని పండుగలా మార్చేశామని ప్రభుత్వం గాలి మాటలు చెబుతోందని అన్నారు. అదే నిజమైతే రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారని నిలదీశారు. మొన్న నెల్లూరు జిల్లాలో వరి రైతు, నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టామాటా రైతుల ఆందోళన కనిపించడం లేదా అంటూ ట్వీట్ చేశారు. పండుగ చేసుకోవడానికే రైతులు రోడ్డెక్కుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇదేనా రైతులకు మీరుస్తున్న మద్దతు అంటూ జగన్ సర్కారుని నిలదీశారు. తన ట్వీట్‌తోపాటు రైతులు టమాటా పంటని రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా జత చేశారు చంద్రబాబు.

Next Story