AP : పాస్టర్ మృతిపై సీబీఐ దర్యాప్తుకు క్రైస్తవ సంఘాల డిమాండ్

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. పాస్టర్ ప్రవీణ్ మృతి మతోన్మాదులు చేసిన హత్య అని ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై సీఎం తక్షణ చర్యలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేయిలని వారు డిమాండ్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా కోనసీమ జిల్లా సఖినేటిపల్లి , మలికిపురం మండలాలలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మర్వో కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు.
పాస్టర్ ప్రవీణ్‌ది హత్యేనంటూ క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతం నుంచి జరిగిన పరిణామాలు చూస్తే ప్రవీణ్ ది హత్యగానే తాము భావిస్తున్నామని తెలిపాయి. మణిపూర్ అల్లర్ల నుంచి తాజాగా జరుగుతున్న పరిణామాల వరకూ క్రైస్తవులు అభద్రతాభావంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com